విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై నార్కొటిక్ కంట్రోల్ బృందం చేపట్టిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుంచి విజయనగరం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అధికారులు అర్ధరాత్రి సమయంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాకు నార్కోటిక్ టీమ్ చెక్ పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వస్తున్న ఓ బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో కూరగాయల బుట్టలు, ముఖ్యంగా కేబేజీ బుట్టల మాటున గంజాయి ప్యాకెట్లను దాచినట్టు గుర్తించారు. మొత్తం 650 కిలోల గంజాయి, అంటే 123 ప్యాకెట్లు వాహనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గంజాయి రవాణాను కూరగాయల సరుకు పేరుతో కప్పిపుచ్చి తరలిస్తున్నట్టు నార్కొటిక్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ గంజాయి ఒడిశా ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. అధికారులు వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొలెరో వాహనం మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని బొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న ముఠా గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నార్కొటిక్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్పై దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ను విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





