రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లోకెక్కింది. పొలిటికల్ ప్రముఖుల వీకెండ్ డ్రగ్ పార్టీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో ఓ ఎంపీతోపాటు.. పొలిటికల్ లీడర్లు, వీఐపీలు పాల్గొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా.. ఓ మహిళ కూడా ఉండటం.. తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్.. ఫామ్‌హౌస్‌లో రెండు గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఫామ్‌హౌస్‌లో పైలట్ రోహిత్ పార్టీ నిర్వహించారని.. వీరంతా హాజరయ్యారని తెలిపారు. ఈగల్ టీమ్‌ను చూసి నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేశారని.. గన్ లైసెన్స్ రితేష్‌రెడ్డి పేరు మీద ఉందని తెలిపారు. దాడుల్లో రెండు గ్రాముల వైట్ పౌడర్‌ను సీజ్ చేశామని.. అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒక మహిళ, వ్యాపారి, రియల్టర్స్ ఉన్నారన్నారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఐదుగురు.. గతంలో వేరే చోట డ్రగ్స్ తీసుకున్నామని చెబుతున్నారన్నారు. ఫామ్‌హౌస్‌లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నామని.. తమకు ఇంటెలిజెన్స్ టీమ్ కూడా ఉందని చేవెళ్ల డీసీపీ తెలిపారు.
ఇక డ్రగ్స్ టెస్ట్‌లో MP పుట్టామహేష్‌యాదవ్, పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలింది. పుట్టా మహేష్, రోహిత్‌రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిద్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని.. నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్‌రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్‌గా పోలీసులు గుర్తించారు..
డ్రగ్స్ పార్టీలో పట్టుబడింది వీరే..
1. పైలట్ రోహిత్ రెడ్డి , తాండూరు మాజీ ఎమ్మెల్యే
2. పుట్టా మహేష్ కుమార్‌యాదవ్, ఏలూరు ఎంపీ
3. నమిత్ శర్మ
4. M. రమేష్
5. V. శ్రవణ్ కుమార్
6. విజయ్ కృష్ణ
7. కౌశిక్ రవి
8. షరీఫ్ రెడ్డి
9. అర్జున్ రెడ్డి
10. రితీష్ రెడ్డి
11. ప్రియాంక రెడ్డి
పార్టీలో లభించిన డ్రగ్స్, వెపన్‌పై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన కౌశిక్ రవి.. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై BNS 109తోపాటు ఆర్మ్స్ యాక్ట్.. NDPS(22), ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీలో ఖరీదైన మద్యం, హుక్కా లభించినట్లు యోగేష్ గౌతమ్ తెలిపారు.
Also read
- Weekly Horoscope: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్! 12 రాశులకు వారఫలాలు
- Telangana: ఫోన్‌కు వచ్చిన ఒక్క మెసేజ్ ప్రాణం తీసింది.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- ‘నా కుటుంబానికి న్యాయం చేయండి’.. చనిపోయే ముందు యువ రైతు ఆవేదన.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ!
- నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?





