హైదరాబాద్: సరూర్‌నగర్ పరిధి భగత్ సింగ్ నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్ నగర్ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.
అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్ లోని ఓ స్క్రాప్ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్‌కు చెందిన షకీర్ వద్ద కంట్రీమేడ్ తుపాకి, ఒక లైవ్తోండ్ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





