అమలాపురం : బండారులంక దంగేటివారిపాలెంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడలి సాయివెంకటజ్యోతి(24)కి 2021లో గ్రామానికి చెందిన శిరీష్ వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో భర్తతో పాటు అత్తమామలు, బంధువులు సాయివెంకటజ్యోతిని వేధించడంతో తట్టుకోలేక శనివారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్కు ఆమె ఉరేసుకున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు అమలాపురం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండ్లి కుమారుడి అదృశ్యంపై కేసు
ఉప్పలగుప్తం: వివాహమైన మూడో రోజునే పెండ్లి కుమారుడు అదృశ్యమైన ఘటనపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై కె. జానీబాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామ యువకుడికి ఏప్రిల్ 29న ఐ.పోలవరం మండలానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. మే 1న ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శనివారం తెలిపారు.
Also read
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.
- చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!
- స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు
- కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి





