నాగర్ కర్నూల్ , పెంట్లవెల్లి భూ తగాదాలతో ఓ ఆర్ఎంపీని కొందరు వ్యక్తులు కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోటకు చెందిన బోగిని మల్లయ్య (57) దాదాపు 35 ఏళ్ల క్రితం పెంట్లవెల్లికి వలస వచ్చి ఆర్ఎంపీగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఎనిమిది ఏళ్ల నుంచి మండల కేంద్రంలోని కొందరి వ్యక్తులతో మల్లయ్యకు భూవివాదాలు నడుస్తున్నాయి. ఇదే విషయంలో అతనిపై గతంలో కూడా ఓసారి దాడి జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం భూ వివాదం విషయమై కొల్లాపూర్ కోర్టులో కేసు నడుస్తోంది. శుక్రవారం కోర్టుకి హాజరైన అనంతరం తన క్లినిక్లో మలయ్య ఉండగా.. ఇద్దరు మహిళలు. ఓ వ్యక్తి లోపలికి వచ్చారు. వారు వెంట తెచ్చుకున్న కారాన్ని అతని కళ్లలో చల్లి రోడ్డుపైకి లాక్కొని వచ్చారు. ఆయన తలపై కర్రతో వ్యక్తి దాడి చేయగా.. ఇద్దరు మహిళలు వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండల కేంద్రంలో భయాందోళనలు మొదలై కొందరు వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు. ఆయన భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
Also read
- Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!
- కార్మికవర్గంపై దాడికి వ్యతిరేకంగా పోరాడుదాం….కంటిపోతు రమణ, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు.
- చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!
- స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు
- కళ్లలో కారం చల్లి.. వేటకొడవళ్లతో నరికి





