తెలంగాణ : రాష్ట్రంలో వరుసగా గురుకుల
పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ మంచిర్యాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ, పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించారు. అయితే ఈ విషయం పిల్లల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలకు చేరుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను స్వయంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




