జెడ్పీ ఉన్నత పాఠశాల భవనంపై దారుణం
నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ఘటన
గూడూరు: ఓ యువకుడిని గొంతు, మర్మాంగం కోసి హత్య చేసిన దారుణ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన షాహూల్ (21) తండ్రి మృతి చెందగా, తల్లి బతుకుదెరువు నిమిత్తం కువైట్కు వెళ్లింది. దీంతో షాహూల్ తన అన్నతో కలిసి ఉంటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న షాహూల్ శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిద్దెపైకి వెళ్లి మద్యం తాగాడు.
శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు మిద్దెపైన రక్తపు మడుగులో పడిఉన్న షాహూల్ చూసి భయంతో కేకేలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా షాహూల్ దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరిస్తున్నారు. వారు అందించే నివేదిక ఆధారంగా కేసు విచారణ చేపడతామని గూడూరు రూరల్ సీఐ కిశోర్ బాబు తెలిపారు.
మృతదేహం పంచనామా చేసే క్రమంలో పోలీసులకు నిర్ఘాంతపోయే విషయం తెలిసింది. మృతుడి మర్మాంగం కోసి అతని జేబులోనే పెట్టినట్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తే వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణంగా హత్య చేసినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ హత్యోదంతంతో విద్యార్థులు ఎక్కడ భయాందోళనలకు గురవుతారోనని పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





