అనంతపురం క్రైం : అనంతపురం, హిందూపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ (అహుడా) కార్యాలయంలో పని చేస్తున్న వార్డు ప్లానర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అహుడాలో వార్డు ప్లానర్ నాగశ్రీ (32)కి ఎనిమిదేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ద్వారకేశ్వరరావుతో వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమార్తె ఆద్య ఉంది. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌లో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఫోన్లో భార్యాభర్తలు ఏదో విషయంపై మాటామాటా అనుకున్నారు. దీంతో మనస్తాపానికి లోనైన నాగశ్రీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించేలోపు ఆమె మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





