February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పల్లగిరిలో వైసిపి కార్యకర్త దారుణహత్య

నందిగామ (ఎన్టీఆర్‌ జిల్లా) : పల్లగిరి లో వైసిపి కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. శనివారం పల్లగిరి గ్రామ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కో ఆప్షన్‌ ఎంపీటీసీ సభ్యుడు షేక్‌ అల్లిషా అన్న కుమారుడు షేక్‌ నాగుల్‌ మీరా ను దుండగులు దారుణంగా హత్య చేసి ఊరు బయట నిర్మానుష్య ప్రదేశంలో మఅతదేహాన్ని పడేశారు. ఈ సమాచారం తెలుసుకున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు గ్రామంలోని సంఘటన ప్రదేశానికి చేరుకొని మఅతుడి కుటుంబ సభ్యులను కలిసి హంతకులను కఠినంగా శిక్షించే విధంగా పోరాడుతానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, సర్వసాధారమయ్యాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, రక్షణ కోసం పోలీసువారిని ఆశ్రయిస్తే న్యాయం అన్యాయం అనే విచక్షణ లేకుండా తెలుగుదేశం నాయకులు చెబితే బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వరస హత్యలతో నందిగామ రికార్డుల్లో నమోదయిందని, ఇంత గొప్పగా పాలకులు పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

Also read

Related posts

Share via