ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇష్టపడ్డాడు.. ప్రాణానికి ప్రాణంగా భావించాడు. ఆమె కూడా కుర్రాడితో క్లోజ్‌గానే ఉంది. ఆ తర్వాత.. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ యువతి ఆ యువకుడితో మాట్లాడటం మానేసింది. ఇంతలో ఆమె బర్త్ డే సందర్భంగా ఫోన్ చేసాడు. చివరకు విషాదం నెలకొంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి పోలీసులు వివరాల ప్రకారం.. యలమంచిలి పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన గంగాధర్.. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త.. ఆ యువకుడిని ప్రేమలో పడేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏడాదిగా ఆమె ఆ యువకుడితో కటీఫ్ చెప్పి.. మాట్లాడటం మానేసింది.
మే 27 సోమవారం నాడు ఆ యువతి పుట్టిన రోజు. దీంతో గంగాధర్.. ఆ అమ్మాయికి కాల్ చేశాడు. బర్త్‌డే కదా మాట్లాడుతుందని అనుకున్నాడు. కానీ గంగాధర్ కాల్‌ను ఆమె రిసీవ్ చేయలేదు. రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో అప్పటికే యువతి దూరమైన బాధతో ఉన్న గంగాధర్.. బర్త్‌డే రోజైనా కనీసం స్పందిస్తుందని భావించాడు. కానీ ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గంగాధర్.. ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కిచెన్‌లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టపడిన యువతి పుట్టినరోజు నాడే.. తాను ప్రేమించిన ఆమె తనకు ఇక దక్కదని.. మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





