SGSTV NEWS online
Crime

అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ.. రోగి, ఆమె తల్లి మృతి



సోన్: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ను లారీ ఢీకొట్టడంతో రోగి, ఆమె తల్లి మృతిచెందారు. సోన్- కడ్తాల్ వై జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా గాడిగూడ మండలం జరి గ్రామానికి చెందిన సరస్వతి (22) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి అక్కడి నుంచి నిజామాబాద్కు రిఫర్ చేశారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి అంబులెన్స్లో సరస్వతి. ఆమె తల్లి పారూబాయి. మరో నలుగురు బంధువులు నిజామాబాద్ ఆస్పత్రికి బయల్దేరారు. కడ్తాల్ వై జంక్షన్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ.. అంబులెన్స్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతి, పారూ బాయి (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై గోపి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Also read

Related posts