రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తెల్లారి కల్లాపి కోసం వరండాలోకి వచ్చి చూడగా.. దెబ్బకు దడుసుకుని ఒక్కసారిగా అరిచింది ఒక ఆమె. ఇంతకీ ఆ వరండాలో ఏం కనిపించింది. అదేంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
అసలే అమావాస్య.. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఊరు అంతా నిద్రపోయారు.. తెల్లారేసరికి ఇంటి ముందు వరండాలో చూస్తే ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏమైంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నారంవారి గూడెం గ్రామంలో ఇంటి వరండాలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు ఇంటి యజమానులతో పాటు స్థానికులకు భయబ్రాంతులు కలిగించాయి.
అల్లాడి పద్మ ఇంటిలో అందరూ రాత్రి నిద్రించాక.. తెల్లవారుజామున ఇంటి వరండా శుభ్రం చేస్తుండగా ఒక ఎర్రటి గుడ్డలో ఉంచిన ఒక జంతు పుర్రె, నిమ్మకాయ, పసుపు, కుంకుమ పూజలు చేసినట్టు సామగ్రి ఉండటంతో ఆమె భయబ్రాంతులకు గురై చుట్టుప్రక్కల స్థానికులను పిలిచి విషయం చెప్పడంతో.. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని చూసి నిన్న అమావాస్య కావడంతో ఎవరో క్షుద్రపూజలు చేశారని భయబ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
Also read
- పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా ఉంటుందంటే!
- దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర ఫలితాలపై శాస్త్రాల హెచ్చరిక!
- నేటి జాతకములు…16 జూన్, 2026
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..




