అది విశాఖలోని సాగర్ నగర్ ప్రాంతం.. అక్కడ ఓ అపార్ట్మెంట్.. అర్ధరాత్రి.. అందరూ నిద్రలోకి జారుకున్నారు.. కుక్కల అరుపులు ఒక్కసారిగా వినిపించాయి. ఎవరైనా కొత్తవారు వీధిలోకి ఎంటర్ అయ్యారా అని వాచ్ మెన్ బయటకు వచ్చి చూశాడు. ఎవరు కనిపించలేదు.. వాష్ రూమ్‌కు వెళ్దామని డోర్ తీస్తే.. లోపల ఏదో తచ్చాడుతున్నట్లు అనిపించింది. ఏంటా అని లైట్ వేసి చూస్తే.. గుండె ఆగేంత పని అయింది. స్నేక్ క్యాచర్ రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తే కాలికి చుట్టేసింది.. దీంతో అంతా గుండెలు పట్టుకున్నారు..
వివరాల్లోకి వెళితే.. విశాఖ సాగర్ నగర్ ప్రాంతం.. అర్ధరాత్రి 12 దాటింది. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ తెరిచాడు. చీకట్లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. కాస్త లైట్ వేసి చూసేసరికి.. ఓ భారీ కొండచిలువ లోపల తిష్ట వేసి కూర్చుంది. దీంతో ఆ వాచ్ మెన్‌కు గుండె ఆగినంత పని అయింది. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించడంతో.. అర్ధరాత్రి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు కిరణ్.
కాలికి చుట్టేసి..!
స్నేక్ క్యాచర్ కిరణ్.. చాకచక్యంగా ఆ భారీ 12 అడుగుల కొండచిలువను బంధించేందుకు యత్నించాడు. రెస్క్యూ చేసి వాష్ రూమ్ నుంచి బయటకు తెస్తున్న క్రమంలో.. రెండు చేతులతో మెడను పట్టుకున్నాడు. దీంతో ఆ కొండచిలువ కిరణ్ కాలికి చుట్టేసింది. మెల్లగా అలాగే సెల్లార్లోకి వచ్చిన కిరణ్ కుమార్.. మరొకరి సహకారంతో కాలికి చుట్టిన కొండచిలువను విడిపించుకున్నాడు. కొండచిలువను రెస్క్యూ చేసి తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలో కొండ ప్రాంతం ఉండటంతో.. అక్కడ నుంచి ఆహారం కోసం కొండచిలువ వచ్చి ఉంటుంది ‘ అని టీవీ9 తో అన్నారు స్నేక్ క్యాచర్ కిరణ్. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమాచారం అందించాలని సూచించారు
Also read
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
- అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..





