SGSTV NEWS online
CrimeTelangana

గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు


హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఏపీలోని అనకాపల్లికి చెందిన శ్యామ్ నాగ్.. హైదరాబాద్ గోపన్పల్లిలోని ఎన్టీఆర్ నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి చిన్ననాటి స్నేహితుడు భార్గవ్రాజ్తో కలిసి గోపన్పల్లిలోని వైన్ షాప్లో మద్యం తాగారు. అనంతరం భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్కు వెళ్లగా.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్ను బలవంతంగా తీసుకెళ్లారు. తన స్నేహితుడిని కిడ్నాప్ చేశారంటూ భార్గవ్రాజ్.. డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శ్యామ్ నాగ్ను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిడ్నాప్ అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో.. నిర్మాణ దశలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి పలు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని బాధితుడు పోలీసులకు తెలిపారు.

Also read

Related posts