నాగులుప్పలపాడు: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి ఆపై హతమార్చాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. బాలికను అమ్మమ్మ వద్ద ఉంచి తల్లిదండ్రులు హైదరాబాద్ లో బేల్దారి పనులకు వెళ్లారు. ఆదివారం అర్థరాత్రి ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను అదే కాలనీకి చెందిన ఆనంద్ అక్కడి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం హతమార్చి ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారయ్యాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్క తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra Pradesh: నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..వీడియో https://sgstvnews.in/crime-news-andhra-pradesh-news-andhra-pradesh-minor-girl-dies-after-assault-in-prakasam-accused-arrested/
Also read
- ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- సోమనాథుడు – సౌరాష్ట్ర, గుజరాత్
- మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!
- రాత్రి బాగానే ఉంది.. తెల్లారేసరికి కత్తిరించి ఉంది.. హాస్టల్లో అమ్మాయిల జడలు కత్తిరిస్తున్నదెవరు?
- యువకుడి ప్రాణాలు బలిగొన్న ఇయర్ ఫోన్





