జీడిమెట్ల(హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభా<Ūనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు.
కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మికి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచ్చిన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Also read
- Andhra: బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్…. M
- Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
- Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
- Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
- గుంటూరు: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే