SGSTV NEWS online
CrimeTelangana

Ghatkesar News: ఫామ్ హౌస్ రిటైర్డ్ ఎస్ఐ కుమారుడి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా..





👉బర్త్ డే పార్టీకి వెళ్లి విగతజీవిగా

👉 రిటైర్డ్ ఎస్సై కుమారుడి మృతిపై అనుమానాలు

Ghatkesar News: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ రిటైర్డ్ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏదులాబాద్ లివిన్ ఫామ్ హౌస్ లొ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ భగాయత్కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి స్నేహితుడు ఘన్కోట్ రిషబ్ తో కలిసి ఏదులాబాద్ లోని లివిన్ ఫామ్ హౌస్ లొ ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి వెళ్లాడు.

మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో రిషబ్ తండ్రి, ప్రవీణ్ కుమారు ఫోన్ చేసి కృష్ణ కౌండిన్య ఫార్మ్ హౌస్ లొ స్పృహతప్పి పడిపోయాడని సమాచారం అందించారు. వెంటనే అతడిని ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి ధ్రువీకరించారు. సరదాగా వేడుకలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడం, మృతికి గల పరిస్థితులపై తీవ్ర అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తండ్రి ప్రవీణ్ కుమార్ ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తండ్రి ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, పార్టీలో ఏం జరిగింది? మృతికి గల అసలు కారణాలు ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఫామ్ హౌస్ నిర్వాహకులతో పాటు వేడుకలకు హాజరైన ఇతర స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

Also read

Related posts