హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పరిధిలో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. చంద్రనాయక్ తండాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో మాదాపూర్, కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రూమ్ నంబర్ 204లో ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలను అరెస్ట్ చేశారు. విదేశీ మహిళలు పాస్‌పోర్టు, వీసా లేకుండా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
దిల్లీకి చెందిన నాయక్ అనే వ్యక్తి మహిళలను ఇక్కడికి రప్పించి వ్యభిచారం నిర్వహించినట్లు నిర్ధరించారు. ప్రధాన నిందితుడు నాయక్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన ముగ్గురు మహిళలను కోర్టు ద్వారా స్వదేశానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. సర్వీస్ అపార్ట్మెంట్ నిర్వాహకులు కస్టమర్ల ఐడీ వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు హెచ్చరించారు.
Also read
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
- మాదాపూర్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
- Ghatkesar News: ఫామ్ హౌస్ రిటైర్డ్ ఎస్ఐ కుమారుడి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా..
- కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?
- గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్.. కత్తితో బెదిరించి సంతకాలు





