మద్యం మత్తు మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ప్రకాశం జిల్లా కోరిశెపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని యువకులు నడిరోడ్డుపైనే వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. కనీసం తాము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా బూతులు తిట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశంలో, వందలాది మంది ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
మెయిన్ రోడ్డుపై ఈ ఘర్షణ జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు హారన్లు కొడుతున్నా, మద్యం మత్తులో ఉన్న యువకులు ఏమాత్రం తగ్గలేదు. చివరకు మరికొందరు యువకులు జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేసినా, పరిస్థితి అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. మేదరమెట్ల పరిసరాల్లో మద్యం విక్రయాలు, బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచి, ఇలాంటి గొడవలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





