SGSTV NEWS
Andhra PradeshCrime

చిన్నతనంలోనే క్రిమినల్ మైండ్ సెట్.. ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేసింది.. అసలేం జరిగిందంటే..



నవమాసాలు మోసి కని గారాబంగా పెంచిన కన్నకూతురే.. అతి కిరాతకంగా తల్లిని కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది. అభంశుభం తెలియని వయసులో మైనర్ బాలిక కన్నతల్లినే ఎందుకు హతమార్చింది? తల్లిని చంపే అంత కోపం ఆ బాలికకు ఎందుకు వచ్చింది? ఇదే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది.


విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం వెంకటరమణపేటలో జరిగిన దారుణ ఘటన సంచలనంగా మారింది. ఎర్రప్రగడ వెంకటలక్ష్మి అనే మహిళ కన్నకూతురు చేతిలో దారుణ హత్యకు గురైంది. వెంకటలక్ష్మికి భర్త సత్యనారాయణ, కుమారుడు హరీష్, కుమార్తె రుచిత ఉన్నారు. వెంకటలక్ష్మి, సత్యనారాయణ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. పిల్లలను బాగా చదివించి ఉన్నతస్థానానికి ఎదిగేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. తన పిల్లలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇదే గ్రామానికి చెందిన సల్లాది హరికృష్ణ అనే యువకుడు సుమారు రెండేళ్ల క్రితం అంటే 2023లో వీరి కుటుంబంలోకి విలన్ లా ప్రవేశించాడు. తరచూ వీరి ఇంటి వైపు వస్తూ రుచితతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత తరచూ వీరిద్దరూ కలుస్తుండేవారు. అలా కలుస్తున్న నేపథ్యంలో తన కూతురు హరికృష్ణకు దగ్గరైందన్న విషయం వెంకటలక్ష్మీ దృష్టికి వచ్చింది. అదే విషయాన్ని రుచితను నిలదీయడంతో తమ మధ్య వ్యవహారం అంతా తల్లి వెంకటలక్ష్మితో చెప్పింది రుచిత. భవిష్యత్తులో హరికృష్ణతో మాట్లాడవద్దని హెచ్చరించింది. దీంతో మనస్తాపం చెందిన హరికృష్ణ, రుచితలు 2023 ఆగష్టు లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఆ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అయితే అప్పటికి రుచిత వయసు 15 ఏళ్లు కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హరికృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేశారు రుచిత తల్లిదండ్రులు.. రుచిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరికృష్ణ పై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు.


ఇదే విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అలా కొన్నాళ్ళు రిమాండ్ లో జైలు జీవితం గడిపిన హరికృష్ణ తరువాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే, రిమాండ్ నుండి బయటకు వచ్చిన హరికృష్ణ కొన్నాళ్లు రుచితకి దూరంగా ఉన్నాడు. ఆ తరువాత మళ్లీ వీరిద్దరి కథ మొదటికి వచ్చింది. తన వల్ల హరికృష్ణ జైలు పాలయ్యాడనే సింపతీ హరికృష్ణపై రుచితకి పెరిగి మరోసారి హరికృష్ణకు దగ్గరైంది. మళ్లీ చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తన పై నమోదైన కేసు విషయంలో రాజీ చేసుకోవడానికి ప్రయత్నించాడు హరికృష్ణ. అందుకు ససేమిరా అన్నారు రుచిత తల్లిదండ్రులు. మరోవైపు ప్రేమిస్తున్న రుచితకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు రుచిత కుటుంబసభ్యులు. ఈ విషయాల పై హరికృష్ణ తరుచూ రుచితతో చర్చిస్తుండేవాడు. తల్లిదండ్రులు రాజీ పడకపోతే తనకు శిక్ష పడుతుందని, అలాగే నీకు వేరొకరికి ఇస్తే ఇద్దరం దూరం అవ్వాల్సి వస్తుందని దీని పై ఇద్దరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రుచితను పదే పదే బలవంతపెడుతుండేవాడు. అలా తమకు అడ్డంకిగా మారిన రుచిత తల్లి వెంకటలక్ష్మిని అడ్డు తొలగిద్దామని రుచితకు చెప్పాడు హరికృష్ణ. అందుకు రుచిత కూడా అంగీకరించింది.

అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ రాత్రి పది గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లాలని తనకు తోడుగా రావాలని తల్లి వెంకటలక్ష్మికి చెప్పింది రుచిత. అదే రోజు తన పై హత్యకు కుట్ర పన్నారని తెలియని వెంకటలక్ష్మీ తన కూతురుతో కలిసి గ్రామశివారుకు వెళ్ళింది వెంకటలక్ష్మి. అప్పటికే అక్కడ తన స్నేహితుడితో మాటువేసి ఉన్న హరికృష్ణ వారిని చూడగానే అమాంతం వెనక నుండి వెంకటలక్ష్మిని పట్టుకొని ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చారు. అనంతరం వెంకటలక్ష్మి చీర విప్పి పెద్ద బండరాయి కట్టి అక్కడే ఉన్న నూతిలో పడేశారు. అలా వెంకటలక్ష్మి మృతి చెందిందని నిర్ధారించుకొని హత్య కేసు నుండి తప్పించుకునేందుకు హరికృష్ణ, రుచితలు నయా స్కెచ్ వేశారు. ఘటనా స్థలం నుంచి ఇంటికి వెళ్లిన రుచిత బహిర్భూమి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లారని ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు తెలియజేసింది రుచిత. విషయం తెలుసుకున్న రుచిత అన్న హరికృష్ణ పోలీసులకు పిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేసి పలు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం రుచితను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వెంకటలక్ష్మి హత్యకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడించింది. రుచిత ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు హరికృష్ణతో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియని బాల్యంలో నయవంచకుడి మాయమాటలు నమ్మి కన్నతల్లిని హతమార్చి కటకటాలపాలైంది చిన్నారి రుచిత. తల్లి వెంకటలక్ష్మి హత్యకు గురై చెల్లి రుచిత జైలు పాలై గందరగోళంగా మారిన కుటుంబం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నాడు.

Also read

Related posts

Share this