‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఓ బాలిక మృతి చెందింది.. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్లో ఈ విషాద ఘటన జరిగింది. అటు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నేపాల్‌కు చెందిన ధను బహదూర్ కుటుంబం కుటుంబం జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా ధను బహదూర్ పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ధను బహదూర్ దంపతుల 13 ఏళ్ల కూతురు పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. బయటకు వెళ్లిన కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తల్లి పుష్పను తల్లి వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తుకు వెళ్లారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు ఐదవ అంతస్తుపై నుంచి పడినట్లు గుర్తించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..? అసలు రహస్యం ఇదే!
- July 2026 Horoscope: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- మిస్టరీ బ్లాస్టర్.. నిప్పు లేదు.. సిలిండర్ పేలలేదు.. కానీ కిచెన్‌లో భారీ పేలుడు! భయాందోళనలో జనం!
- Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
- Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!




