కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్మెయిలింగ్కు దిగాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





