హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేకోపోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్ఫ్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది
భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





