SGSTV NEWS online
Andhra PradeshCrime

శ్రీకాకుళంలో బీజేపీ నేత వీరంగం



శ్రీకాకుళం:  శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు హల్‌చల్‌ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపైకి కారుతో దూసుకెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ఢీకొట్టారు. ఈ ఘటనలో సీఐ, ఎస్‌ఐ ఇద్దరూ గాయపడ్డారు.

కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న చల్లా వెంకటేశ్వరరావును పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తన కారును అనుమతించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల బారికేడ్లను కారుతో ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనలో గాయపడిన సీఐ, ఎస్‌ఐలను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై బీజేపీ నేత వ్యవహరించిన తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Also read

Related posts