December 20, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

హర్షిత స్కూల్ వ్యవహారంలో ఇద్దరి అరెస్టు



ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని హర్షిత స్కూల్ చైర్పర్సన్ నందిగం రాణి భర్త ధర్మరాజు, వారి సమీప బంధువు గవిర్ని సురేశ్లలను సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

జంగారెడ్డిగూడెం పట్టణం, రాజమహేంద్రవరం,: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని హర్షిత స్కూల్ ఛైర్పర్సన్ నందిగం రాణి భర్త ధర్మరాజు, వారి సమీప బంధువు గవిర్ని సురేశ్లను సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ధర్మరాజు, రాణి దంపతులు పాఠశాల నిర్మాణం, అభివృద్ధి, లాభాల్లో వాటా అంటూ నమ్మించి తెలుగు రాష్ట్రాల్లో పలువురి నుంచి రూ.కోట్లలో అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ధర్మరాజును రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో పోలీసులు మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం సీఐడీ అధికారులు పాఠశాలకు వచ్చి అతనితో పాటు బంధువు సురేశ్ను అదుపులోకి తీసుకొని స్థానిక ఠాణాలో సాయంత్రం వరకూ విచారించారు. రాణి ఆచూకీ లేకపోవడంపై ప్రశ్నించారు. అప్పులు సేకరించిన తీరు, పాఠశాల స్థలం, ఇతర ఆస్తులపై ఆరా తీసినట్లు సమాచారం. చివరకు ధర్మరాజు, సురేశ్ లను అరెస్టు చే రాజమహేంద్రవరానికి తరలించినట్లు సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రకటించారు. వీరిని గురువారం ఏలూరులోని  కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

సీఐడీకే మస్కా కొట్టిన రాణి: ఈ కేసులో ప్రధాన

నిందితురాలు రాణి పరారీని సీఐడీ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు సోమవారం హర్షిత పాఠశాలకు వెళ్లినప్పుడు, పథకం ప్రకారం విద్యార్థులతో ఆందోళన చేయించి, భవనంలో నుంచి బయటకు రాలేదు. చివరకు కిటికీలో నుంచి ఆమెకు 41ఏ నోటీసు అందజేశారు. అనారోగ్యం కారణంగా వెంటనే రాలేనని, రెండ్రోజుల్లో వస్తానని నమ్మించిన రాణి.. బుధవారం అందుబాటులోకి రాలేదు. ఆమె పరారైనట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ అధికారులు.. అరెస్టుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read

Related posts

Share via