పాడేరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గిరిజన యువకులు మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. పాడేరు మండలం వంతరపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేష్(25), హుకుంపేట మండలం గొందిరాపకు చెందిన సూర్యప్రకాష్(28), తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు(18) సోమవారం మత్స్యగుండం జాతరకు వెళ్లారు. తిరిగి ముగ్గురు బైక్‌పై బయలుదేరారు. రమేష్ వాహనాన్ని నడుపుతుండగా మిగిలిన ఇద్దరు వెనుక కూర్చున్నారు.
గుత్తులపుట్టు సంతబయలు దగ్గరలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి దూసుకుపోయి విద్యుత్ స్తంభాల ప్రాంతంలో ప్రహరీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రేగం సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరూ తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన యువకులు 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. గెమ్మెలి రమేష్ మృతి చెందాడు.
సీదరి పౌలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పాపినాయుడు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
Also read
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





