మరో యువతికి తీవ్ర గాయాలు
పాడేరు: సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగిన ముగ్గురు గిరిజన యువతులు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం ఈ విషాద ఘటన ස0යි. హుకుంపేట మండలం మారుమూల బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన గిరిజన యువతులు సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి(16) అంజలి కలిసి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీలోని ములగుమ్మి జలపాతం వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు.
గ్రామంలో ఇటుకల పండుగ కావడంతో నలుగురు యువతులు జలపాతం వద్ద ఉత్సాహంగా గడిపారు. త్రిష పవిత్ర, రత్నకుమారి జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున పెద్ద బండరాయిపై నిల్చుని సెల్ఫోన్లో వారిని ఫొటోలు తీస్తోంది. అయితే, త్రిష, పవిత్ర, రత్నకుమారి ప్రమాదవశాత్తూ జారి జలపాతంలో పడిపోయారు. ముగ్గురూ నీటిలో మునిగి మృతిచెందారు. వారు మునిగిపోయారనే కంగారులో అంజలి బండరాయి నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న జంబువలస గ్రామానికి చెందిన గిరిజనులంతా జలపాతం వద్దకు చేరుకుని ముగ్గురి మృతదే-హాలను బయటకు తీశారు. గాయపడిన అంజలిని అనంతగిరి మండలంలోని లుంగపర్తి పీహెచ్సీకి తరలించారు. మృతిచెందిన త్రిష హుకుంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. రత్నకుమారి అనంతగిరి మండలం బీంపోల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదు-వుతూ పదో తరగతి పరీక్షలు రాసి ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన ముగ్గురు గిరిజన యువతులు మృతిచెందడంతో జంబువలస గ్రామంలో విషాదం నెలకొంది.
Also read
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
- దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, ముఖ్యమైన నియమాలు ఇవే!
- నవదుర్గలలో ఈరోజు 5వ రోజు – స్కందమాత, ఐదవ నవదుర్గ…!!*_
- దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
- దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!





