తీవ్రమైన మైగ్రేన్, ఇతర అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడితో ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అనారోగ్య కారణాలతో వివాహిత బలవన్మరణం
సాగర్‌నగర్ (విశాఖపట్నం), జూలై 14: తీవ్రమైన మైగ్రేన్, ఇతర అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడితో ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని రామానాయుడు స్టూడియో సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. మంటల్లో కాలుతూనే ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ వచ్చిన భయానక దృశ్యం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ కథనం ప్రకారం… హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన జక్కా వెంకటలావణ్య ప్రియ(35) హెల్త్ కేర్ రంగానికి చెందిన ఓ సంస్థ ఉద్యోగిని. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఆమెకు 2017లో అశ్వినికుమార్‌తో వివాహం కాగా, ఆరేళ్ల కుమారుడు దేవాంశ్ ఉన్నాడు. అశ్వినీకుమార్ శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. దీంతో వీరు 2023 మే నుంచి మధురవాడలో నివసిస్తున్నారు. లావణ్యప్రియ మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. మంగళవారం స్కూటీపై బీచ్‌రోడ్డుకు చేరుకుని వెంట క్యాన్‌లో తెచ్చుకున్న రెండు లీటర్ల పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. శరీరం మంటల్లో కాలిపోతుండగానే రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చారు. బీచ్ పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు రమేశ్, శ్రీనుతో పాటు ప్రయాణికులు స్పందించి మంటలను అదుపు చేశారు. 70శాతానికి పైగా కాలిన గాయాలతో కొనఊపిరితో ఉన్న బాధితురాలు తన పేరు, కుటుంబ వివరాలను తెలియజేశారు. ఆమెను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్‌ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



