యూపీలోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని.. తల్లి మరికొందరితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆపై తల, మొండెం వేరు చేసి కాలువలో పడేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి తల్లి సహా పలువురిని అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి కర్కశంగా మారింది. 17 ఏళ్ల కన్న కూతుర్నే కడతేర్చింది. డెడ్ బాడీని ముక్కలుగా కోసి కాలువలో పడేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. మీరట్‌లోని దౌరాలాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కూతురి తల, మొండెం వేరు చేసి
ఆస్తా అనే 17 ఏళ్ల యువతి తన ప్రియుడితో రహస్యంగా ఫోన్ మాట్లాడుతుండగా ఫ్యామిలీకి దొరికిపోయింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ముఖ్యంగా ఆ యువతి తల్లి రాకేశ్ దేవి (40) ఈ విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఎలాగైన తన కూతురిని హతమార్చాలని అనుకుంది. దీంతో తన కుటుంబ సభ్యులతో ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారమే.. తన కూతురు ఆస్తాను మొదట గొంతు నులిమి హత్య చేసింది.
ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి బోల్టు కట్టర్‌తో ఆస్తా కాళ్లు, చేతులు, తల వేరు చేసింది. అనంతరం ఒక తల మినహా మిగతా పార్ట్‌లను ఒక క్లాత్‌లో చుట్టి బహదూర్‌పూర్ కాలువలో పడేసి.. తలను గంగా కాలువలోకి విసిరేశారు. అనంతరం ఓ రైతు కెనాల్లో డెడ్‌బాడీ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో మృతురాలి తల్లి రాకేష్ దేవి (40), కమల్ సింగ్ (56), మోను (26), సమర్ సింగ్ (54) సహా 14 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు గౌరవ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా బాధితురాలి తండ్రి సీఆర్పీఎఫ్ జవాన్ తెలిసింది. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నారని.. ఈ నేరం గురించి ఆయనకు ఏమీ తెలియదని ఎస్ఎస్పీ తాడా తెలిపారు
Also read
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న
- తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
- విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVRను విశ్లేషించనున్న FSL బృందం
- ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలివేనా.? షాకింగ్ విషయాలు చెప్పిన అమెరికా నిపుణులు