SGSTV NEWS
Spiritual

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం ఇటువంటి వ్యక్తుల స్నేహం మహా ప్రమాదం.. వీలైంత దూరం పెట్టాల్సిందే..

నీ స్నేహితులు ఎవరో చెబితే..నువ్వెలాంటి వాడివో నేను చెబుతా అనే సామెత ఉంది. ఎందుకంటే నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఇదే విషయాన్నీ గరుడ పురాణం కూడా పేర్కొంది. సహవాసం ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సహవాసం మంచిదైతే ఆ వ్యక్తి జీవితం సరైన దిశలో వెళుతుంది.. ఆ వ్యక్తి సహవాసం చెడ్డదైతే మంచి వ్యక్తి కూడా తప్పుడు మార్గంలో వెళ్లి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇటువంటి వ్యక్తుల సహవసనికి దూరంగా ఉండమని చెబుతోంది గరుడ పురాణం.


గరుడ పురాణం కొంతమంది వ్యక్తుల సహవాసం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చెబుతుంది. వారి నుంచి దూరం పాటించడం తెలివైన పని. గరుడ పురాణం సనాతన ధర్మంలోని 18 గొప్ప పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం మనుషుల భవిష్యత్తుకు శుభాలను కలిగించే అనేక విధానాలను ప్రస్తావించింది. గరుడ పురాణం జీవితం నుంచి మరణం వరకూ మాత్రమే కాదు.. మరణం తరువాత జరిగే సంఘటనలను కూడా వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం కొంతమంది వ్యక్తుల సహవాసం కష్టాలు, నష్టాలను కలిగిస్తుంది. కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండలని చెప్పింది. అలా దూరం పాటించాల్సిన ఆ ఐదుగురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

అదృష్టం మీద ఆధారపడి జీవించే వారికీ దూరంగా కొంతమంది అదృష్టం మీద మాత్రమే ఆధారపడతారు. అలాంటి వారు ఏ పని చేయరు సరికదా.. ఇతరులను కూడా అదే విధంగా జీవించమని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు. అయితే జీవితంలో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే వారిని అదృష్టం కూడా ఆదుకోదు. పని చేయడం ద్వారా అదృష్టాన్ని మార్చుకోవచ్చు, అంతేకాని లక్ ని నమ్ముకుని దానిపై ఆధారపడి సమయాన్ని వృధా చేసుకుని జీవించే వారి అదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. కనుక ఇటువంటి ఆలోచన ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండండి.

ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తులకు దూరంగా చాలా మంది జీవితంలో చాలా ప్రతికూల ఆలోచనలతో ఉంటారు, ప్రతిదానిలోనూ ప్రతికూలతను చూస్తారు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల విజయానికి అడ్డంకిగా మారతారు. అలాంటి ప్రతికూల ఆలోచనాపరులు మన చుట్టూ నివసిస్తుంటే.. వారికి దూరంగా ఉండటం తెలివైన పని.



అహాన్ని ప్రదర్శించే వ్యక్తులకు దూరంగా కొంతమంది ప్రతి విషయంలోనూ తమను తాము గొప్పగా చూపించుకోవాలనుకునుకుంటారు. ఇతరులకంటే తాము గొప్పగా కనిపించడం కోసం ఎల్లప్పుడూ తమను తాము గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులు తమ అహాన్ని తీర్చుకోవడానికి ఇతరులను బాధపెట్టడానికి కూడా వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

పనికిరాని సలహాలు చెప్పేవారికి దూరంగా కొంతమందితో మాట్లాడం వలన సమయం వృధా తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారు ఏ పనినీ సరిగ్గా చేయరు. ఇతరులు చేస్తుంటే కొద ఓర్వలేరు. పైగా పని చేసేవారి దగ్గరకు వెళ్లి పనికిరాని విషయాలు మాట్లాడతారు. కనుక అటువంటి వారికి దూరంగా ఉండటం మంచిది. అలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం అంటే విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే.

సోమరితనం ఉన్నవారికి దూరంగా సోమరితనంతో జీవించే వారు తమ వైఫల్యాలకు తామే బాధ్యుడవుతారు. అయితే సోమరి ఎల్లప్పుడూ తన వైఫల్యాలకు విధిని లేదా వేరొకరిని నిందిస్తాడు. అతను తన లోపాలను గురించి ఎన్నడూ పట్టించుకోడు. చూసుకోదు. కనుక అటువంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి.

Related posts

Share this