April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ హత్య.. సీసీ కెమెరాల పరిశీల.. కుటుంబీకుల షాకింగ్‌ ఆరోపణ


హైదరాబాద్‌ మియాపూర్లోని దీప్తిశ్రీనగర్‌ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిన్న ఉదయం 10 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లోకి చొరబడి కత్తి, ఐరన్ రాడ్డుతో స్పందన మొఖం, శరీర భాగాలపై విచక్షణరహితంగా దాడిచేసి చంపారు. తర్వాత బయటి నుంచి ఇంటి మెయిన్ డోర్ లాక్ చేసి పారిపోయారు. హత్యకు గురైన మహిళ స్పందనగా గుర్తించారు పోలీసులు.


అయితే సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన స్పందన తల్లి తాళం వేసి ఉండడడాన్ని చూసి కూతురుకు కాల్ చేసింది . ఎంతకీ ఫోన్ తియకపోవడంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో స్పందన విగతజీవిగా పడి ఉంది. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అపార్ట్మెంటులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. స్పందనను హత్య చేసింది ఆమె భర్తేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విడాకుల కేసు కోర్టు విచారణలో ఉందని తెలిపారు కుటుంబ సభ్యులు.

ఏపీలోని వైజాగ్ కు చెందిన విజయ్కుమార్, బండి స్పందనకు 2022 ఆగస్టు 4న పెళ్లైంది. వీరిద్దరూ మియాపూర్ దీప్తీశ్రీనగర్లో కాపురం పెట్టారు. 10 నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థాలు పెరిగాయి. దీంతో స్పందన.. ఆమె తల్లి నమృత, సోదరుడితో కలిసి నివసిస్తోంద

Also read

Related posts

Share via