నా బంగారు నగలు నాకు ఇవ్వాలంటూ.. భర్తను స్తంభానికి కట్టివేసింది ఓ భార్య. బంగారం ఇస్తావా ఇవ్వవా అని నిలదీయడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన కావ్య అనే మహిళ.. నాలుగు సంవత్సరాల కిందట దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్ తో వివాహం జరిగింది. కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి సంసారం.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో పెద్దల సమక్షంలో విడాకుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కావ్యకు రావలసిన బంగారు ఆభరణాలు, నగదు తిరిగి ఇచ్చేందుకు భర్త కరుణాకర్ అంగీకరించాడు. కానీ కరుణాకర్ బంగారు ఆభరణాలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో, నాలుగు సంవత్సరాల తర్వాత కరుణాకర్ గాజులపల్లిలోని ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. కరుణాకర్‌ను గమనించిన కావ్య అందరి ముందు నిలదీసింది. దీంతో సరియైన సమాధానం రాకపోవడంతో అతన్ని తాళ్లతో బంధించి, స్తంభానికి కట్టేసింది. తనకు ఇవ్వాల్సిన బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం పోలీసులకు చేరింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇరువురిని సముదాయించి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మాజీ భర్తను కట్టేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





