కత్తులతో కాదూ కంటిచూపుతో చోరీలు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంటికి లాక్ ఉంటే చాలూ.. బ్రేక్ అయినట్టే. అలా తెలుగురాష్ట్రాల్లో కిలోల కొద్ది బంగారాన్ని కొట్టేశాడు. ఇంతకీ ఎవరా దొంగ? ఏంటతని మోడస్ ఓపెరాండి? ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..
పైన ఫోటోలో ఇన్నోసెంట్కి కేరాఫ్ అడ్రస్‌గా కనిపిస్తున్న వ్యక్తి పేరు తిప్పరాజు రామకృష్ణ. పుట్టింది మహబూబ్‌నగర్‌లో.. ఉండేది హైదరాబాద్‌లో.. దొంగతనాలు చేసేది విశాఖలో. ఇప్పటిదాకా 79 చోరీలు చేశాడు. అన్నీ సింగిల్‌గానే. ఎక్కడా ఎవ్వర్నీ చేరదీయలేదు. పక్కా రెక్కీ నిర్వహించి పకడ్బందీగా చోరీ
మార్చి 1న మధురానగర్‌లోని ఓ ఇంటికి స్పాట్ పెట్టాడు రామకృష్ణ. పక్కా రెక్కీ నిర్వహించి అంతే పకడ్బందీగా దొంగతనం చేశాడు. ఊరెళ్లి తిరిగొచ్చిన ఓనర్.. లాక్ బ్రేక్ అయి ఉండటం చూసి షాకయ్యాడు. బీరువాలోని రూ.23 తులాల బంగారం, రూ.లక్ష నగదు మిస్సింగ్. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు స్పాట్లో ఆధారాలు సేకరించారు. వేలిముద్రల సాయంతో ఆరా తీస్తే.. పాత నేరస్థుడు రామకృష్ణ డొంక కదిలింది.
మహబూబ్‌నగర్, కోదాడకు ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కోదాడకు వెళ్లిన పోలీస్ బృందాలు రామకృష్ణ కోసం గాలించాయి. ఫలితం లేకపోవడంతో కుటుంబసభ్యులపై నిఘా పెంచారు. దీంతో రామకృష్ణ సోదరిపై అనుమానంతో ఇంట్లో తనిఖీ చేయగా 3.40లక్షల నగదు, 28గ్రాముల బంగారం బయటపడింది.
కాల్‌డేటాపై ఫోకస్.. దొరికిపోయిన రామకృష్ణ
చోరీ చేసిన బంగారం మొత్తం తీసుకెళ్లి రామకృష్ణ బ్యాంక్‌లో పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో సోదరి సహకరించేదట. ఫైనల్‌గా కాల్‌డేటాపై ఫోకస్ చేయడంతో రామకృష్ణ దొరికిపోయాడు. ప్రస్తుతానికి రిమాండ్‌కి పంపారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే .. రికవరీ సొమ్ముపై క్లారిటీ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





