భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
TG Crime : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌కు చెందిన బత్తుల వీరయ్యకు అదే జిల్లా పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీకి చెందిన త్రివేణితో వివాహమైంది. కాగా త్రివేణిని కొంతకాలంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బత్తుల నాగరాజు మానిసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. నాగరాజు వీరయ్యకు దగ్గరి బంధువు అవుతాడని తెలుస్తోంది.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ బెటాలియన్‌లో నాగరాజు విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నాగరాజు కొంతకాలంగా త్రివేణి భర్తకు త్రివేణి అసభ్య పోటోలతో పాటు అసభ్యకర సందేశాలను వాట్సాప్ లో పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా నీపెళ్లాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావురా.. నీపెళ్లం సరైంది కాదురా, పనికిమాలింది అంటూ సందేశాలు పంపినట్లు ఆరోపణలు. ఈ క్రమంలో త్రివేణికి ఆమె భర్తకు మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. కానిస్టేబుల్ నాగరాజు వేధింపులు తాళలేక త్రివేణి ఇటీవల పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
త్రివేణి ఫోటోలను, అసభ్యకర సందేశాలను భర్తకే పంపడంతో తీవ్ర మనోవేదనకు గురైన త్రివేణి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కుటుంబసభ్యులు పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతిచెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ బత్తుల నాగరాజు వేధింపులు తాళలేకే తన కుమార్తె ఆత్మహత్యకు చేసుకుందని మృతిరాలి తండ్రి శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ బత్తుల నాగరాజుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- ఇదేం పనయ్యా.. ప్రభుత్వ ఉద్యోగంలో లక్షకుపైగా జీతం.. చేసేదేమో చైన్ స్నాచింగ్‌లు
- 5 నెలలుగా ఇంటికి తాళం.. అనుమానంతో తెరిచిన ఓనర్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దృశ్యం!
- ఏపీ లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. మద్యం మాఫియా మైండ్ బ్లాక్.. రంగంలోకి ఐటీ!
- అరేయ్.. ఏంట్రా ఇది.. హుండీ లెక్కింపు ఉద్యోగాలు.. అంటూ ఉన్నది మొత్తం ఊడ్చేశాడు.. చివరకు
- చిన్న నిర్లక్ష్యం.. పెను ప్రమాదం.. బ్యాటరీ ఛార్జింగ్ పెడుతుండగా పేలుడు.. బాలుడి చేయి ఛిద్రం!





