రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.
రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు. అందులోని రూ.10 వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఏంటీ దౌర్జన్యం అని ప్రశ్నిస్తే తోసేసి పరారయ్యారు
నలుగురు హిజ్రాలు అరెస్ట్
బాధితుడి ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరికి చెందిన సూర్య భాను ప్రకాష్, జనగామకు చెందిన విజయ్, భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలకు చెందిన సాయికుమార్‌తో పాటు మరో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పది నెలల క్రితం సూరారంలో రహదారులపై భిక్షాటన చేసే వారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా రైళ్లలో బలవంతంగా హిజ్రాలు ఇలా డబ్బులు లాక్కుంటున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు.
Also read
- భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
- నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
- పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
- నేటి జాతకము 29 జూలై, 2026
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?





