హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ
వాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటోంది. శ్రీనివాస్ చర్లపల్లిలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తరువాత డోర్ వేసుకున్న స్వాతి వేడినీటి కోసం బకెట్ లో ఎలక్ట్రిక్ వాటర్‌హీటర్ వేసిన సమయంలో ప్రమాదవశాత్తు చెయ్యి వాటర్‌హీటర్ ఉన్న నీటిని తాకింది. దీంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన పై పోర్షన్ వారు భర్తకు సమాచారం అందించడంతో అతను వచ్చి లోపలకు వెళ్లి చూడగా కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





