SGSTV NEWS online
Andhra PradeshCrime

స్కూల్‌లోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి.. మరో బాలికకూ గాయాలు!




అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్ల కొమ్మలు కోసే రంపంతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది.



పాఠశాల అంటే విద్యార్థులకు భద్రతతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించే ప్రదేశం. అలాంటి చోటే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తోటి విద్యార్థులతో కలిసి చదువుకునేందుకు స్కూల్‌కు వచ్చిన పదో తరగతి బాలికపై ఓ గుర్తుతెలియని వ్యక్తి రంపంతో దాడి చేశాడు. ముఖం, తల, వీపు భాగాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాలికను చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో కలకలం రేపింది.



రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం స్కూల్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఉండగా ఓ గుర్తుతెలియని యువకుడు పాఠశాలలోకి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న చెట్ల కొమ్మలు కోసే రంపంతో బాలికపై దాడికి దిగాడు. ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపైనా దాడి చేయడంతో ఆమె కూడా గాయపడింది.


అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటున్న బాలికలపై ఒక్కసారిగా దాడి జరగడంతో పాఠశాలలో భీతావహ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో అర్థం కాక విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రధాన బాధితురాలిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు? విద్యార్థినికి తెలిసిన వ్యక్తేనా? వ్యక్తిగత కక్షలతో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉండాల్సిన పాఠశాలలోనే ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం స్కూల్ ప్రారంభమైన సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి చొరబడి విద్యార్థినులపై దాడికి పాల్పడటం పాఠశాలల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిందితుడిని త్వరగా పట్టుకుని, దాడికి గల కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.



*నా కళ్ళముందే కోసేశాడు..!*

తరగతి గదిలో బాలిక దారుణ హత్యపై ఉపాధ్యాయిని వివరణ..!

షాక్ లో ఉన్న టీచర్..!

విలపిస్తూ వివరాలు వెల్లడి..!

Also read

Related posts