గుంటూరు : శిక్షణ పేరిట ఫోర్జరీ పత్రాలతో ఆయుధాలు సేకరించిన మైలా విజయహర్ష (27) అనే యువకుడిని సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు తుపాకులు, 94 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లుకు చెందిన విజయహర్ష ఎంఏ చదివాడు. నకిలీ పత్రాలు సృష్టించి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లో షూటింగ్ శిక్షకుడిగా ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం చిత్తూరులో పని చేస్తున్నాడు. శిక్షణ నిమిత్తం శాప్ అనుమతులతో ఆయుధాలు సేకరించాల్సి ఉండగా, విజయహర్ష అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, వాటినే కలెక్టర్ కు సమర్పించి ఆయుధాల సేకరణకు అనుమతులు పొందాడు.
పోలీసులకు సమాచారం అందడంతో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. హర్ష నకిలీ పత్రాలతో ఆయుధాలు సేకరించినట్లు గుర్తించి నగరంపాలెంలో అరెస్టు చేశారు. అతని నుంచి 22 రైఫిల్, 12 బోర్ షూట్ గన్, 380 పిస్టల్, 50 రౌండ్ల బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 380 పిస్టల్ అసలైనది. ఇందులో వాడే 9ఎంఎం బుల్లెట్లు ఆరు రౌండ్లు, 380 సైజ్వి 44 రౌండ్లు ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





