అతి ఆశ పడితే అడ్డంగా మునిగపోవడం పక్కా. ఖమ్మం నగరంలో అదే జరిగింది. అచ్చం సినిమా స్టైల్లో మహిళను మోసం చేశారు నిందితులు. గోల్డ్ బిస్కెట్ దొరికింది అంటూ కథ అల్లి ముంచేశారు. పోలీసులు నిందితుల ఫోటోలు విడుదల చేశారు. ..
మోసం.. మోసం.. మోసం.. యాడ చూసినా మోసమే.. ఏ పని చేద్దామన్న మోసమే ఎదురవుతుంది. కన్నింగ్ గాళ్లు రోజుకో కంత్రీ ఐడియాతో చెలరేగిపోతున్నారు. మంచి చేస్తున్నట్లు నటిస్తూ కొందరు నిలువునా ముంచేస్తున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుచూసిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ. కొణిజర్ల మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఖమ్మం నగరం బోసుబొమ్మ సెంటర్లో నివాసం ఉంటోంది. ఈ నెల 20న పాత బస్టాండు వైపునుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా గాంధీచౌక్ వద్ద ఓ అపరిచిత మహిళ ఆమెను అనుసరించింది. ఆంధ్రాబ్యాంకు సమీపం వద్దకు రాగానే అపరిచిత మహిళ ఓ పొట్లాన్నిఈమె ముందు పడేసి తీసింది. తనకు బంగారం బిస్కెట్ దొరికిందని.. చెరిసగం తీసుకుందామని చెప్పి నమ్మించింది.
అక్కడికి వచ్చిన మరో వ్యక్తి అది పది తులాలు ఉంటుందని రూ.10లక్షలకు పైగా విలువ ఉంటుందని నమ్మబలికాడు. బంగారం బిస్కట్టు తీసుకుని రూ. 5 లక్షలు తనకు ఇవ్వాలని ఆ మహిళను సదరు నిందితురాలు కోరింది. దీంతో అందతా నిజమే అని నమ్మిన ఆ మహిళ.. తన చేతిలోని రూ. 10వేల నగదు, మెడలోని సుమారు 2 తులాల బంగారపు గొలుసు ఇచ్చింది. మిగిలిన డబ్బు తీసుకువచ్చే వరకు తాను కేశవరావు పార్కు వద్ద కూర్చుంటానని నిందితురాలు చెప్పడంతో ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అనంతరం తనిఖీ చేయగా.. అది నకిలీ బంగారమని తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించి నిందితులు కోసం గాలించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు ..సదరు నిందితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని నిందితుల పోటోలు విడుదల చేశారు
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్‌కు వెళ్లిన భర్త.. సైలెంట్‌గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





