విశాఖపట్నం: నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్డీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో సుమారు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. జీతాలు అడిగితే దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు పాటించకుండా పీఎఫ్‌లు కూడా చెల్లించని సాప్ట్ వేర్ కంపెనీ.. ఫేక్ ఇన్వాయిస్లు ఆఫర్ లెటర్స్‌తో మోసానికి పాల్పడింది. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతున్నారని తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!

- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!

- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?

- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!

- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?

