Kakinada Crime: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జరిగింది. గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసముంటున్నారు. బర్రెకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నబుల్లి తనకు ఉన్న మూడెకరాల తోటలో తన కూతురు కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని గామస్తులు తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వాపోయారు.
Also read
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
- అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
- భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం
- కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!





