April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime : కడపలో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి


కడప జిల్లా బద్వేల్ లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్‌బాషా 4వతరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.

AP Crime : టీచర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్ లోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో జరిగింది

పోలీసుల కథనం మేరకు.. లిటిల్ ప్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్‌బాషా కొంత కాలంగా నాల్గవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడ్ని స్టేషన్‌కు తరలించి, విచారణ చేపడుతున్నారు.

అన్వర్‌ నాల్గవతరగతి విద్యార్థినిని తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రయివేట్ పార్ట్స్‌పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పుకుంది.దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థిని బంధువులు, ఇరుగుపొరుగువారు అన్వర్‌ బాషాపై దాడి చేశారు. దీంతో పాఠశాలలో గందరగోళం నెలకొంది . విషయం తెలిసిన పోలీసులు పాఠశాలకు చేరుకుని అన్వర్‌ను స్టేషన్‌కు తరలించారుబాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via