నిడదవోలు లో ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమబద్ధీకరించాలనీ, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్ర బాబు, ఆంద్రప్రదేశ్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణ లు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా సరఫరా కాని కారణం గా చాలా బంకులు మూతపడ్డాయనీ, తెరిచి వున్న 1 లేదా 2 బంకుల్లో బారెడు బారుగా లైన్ లో నిలబడి గంటల పాటు , కొన్ని చోట్ల 2 రోజుల తర్వాత రమ్మనే సమాధానాలతో నిత్యం పనులకు వెళ్ళే రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటోలు, రవాణా వాహనాల పై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికులు, మోటార్ లు ద్వారా నడిచే ప్లాట్ ఫాం రిక్షా కార్మికులు, తమ జీవనోపాధి కోల్పోయి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆయిల్ కొనుగోలు పై భారత్ పై అమెరికా ఆంక్షల ప్రభావం భారత దేశం పై ఏమీ ఉండదని ఒక ప్రక్కన కేంద్ర ప్రభుత్వం ఢంకా బజాయిస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని, సామ్రాజ్య వాద అమెరికా అనుసరిస్తున్న దురాక్రమణ యుద్ధాల ఫలితంగా ప్రపంచ ప్రజానీకం కష్టాల పాలవుతున్నారనీ, తక్షణమే మోడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు లంకాడ గణపతి, పిచ్చా సూర్య కిరణ్, మల్లిడి రామిరెడ్డి, ఆనంద్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు .
Also read
- Kumkuma : కుంకుమ కింద పడితే అశుభం కాదా?
- జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది? శుభం లేదా అశుభం.. షాకింగ్ నిజాలు!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు





