హైదరాబాద్: “మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది” అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది.
హైదరాబాద్ సైకిల్ ట్రాక్ లో ఓ మహిళా రన్నర్కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది.
భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్దతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





