నెల్లూరు జిల్లా పులికల్లు గ్రామంలో నాగేంద్ర అనే బాలుడు కలలో శివుడి ఆదేశంతో పుట్టలో శివలింగాన్ని బయటకు తీశాడు. తొలుత ఎవరూ నమ్మకపోయినా, పట్టుదలతో లింగాన్ని వెలికితీసి, తన ఇంటి వద్ద చిన్న గుడిలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు. ఈ అద్భుత సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తూ, బాలుడి భక్తిని ప్రశంసించేలా చేసింది.

శివుడు కలలో కనిపించి, పుట్టలో నుంచి శివలింగాన్ని బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడని ఓ బాలుడు చెప్పడంతో, నెల్లూరు జిల్లాలో ఒక అద్భుత సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, పులికల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో జరిగింది. నాగేంద్ర అనే బాలుడికి గత మూడు నెలలుగా శివుడు కలలో దర్శనమిస్తున్నాడని తెలిసింది. శివుడు తాను ఫలానా చోట పుట్టలో ఉన్నానని, తనను అక్కడి నుంచి తీసుకెళ్లి పూజలు జరపమని ఆదేశించాడు. బాలుడు ఈ విషయం కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు చెప్పగా, వారు తొలుత నమ్మలేదు. తెలియక మాట్లాడుతున్నాడని లైట్ తీసకున్నారు. సుమారు 10 రోజుల క్రితం, బాలుడు కొంతమంది గ్రామస్తులను ఒప్పించి, కాలనీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలోని పుట్ట వద్దకు తీసుకెళ్లాడు. అయితే, అక్కడ నాగుపాము కనిపించడంతో వారు వెనుదిరిగారు. తిరిగి సోమవారం నాడు వారు పుట్ట వద్దకు వెళ్లి, పుట్టను తవ్వి, అందులో ఉన్న శివలింగాన్ని బయటకు తీసుకొచ్చి కాలనీకి చేర్చారు. నాగేంద్ర తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మూడు వైపులా ఇటుకలు పేర్చి, దానిపై ఒక సిమెంట్ అచ్చును ఏర్పాటు చేశాడు. దానిని చిన్న గుడిగా భావించి, అందులో శివలింగాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలియడంతో, పలువురు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారు బాలుడి భక్తి శ్రద్ధలను చూసి ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు.
Also Read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





