బంగారం ధరలు అమాంతం పెరగటంతో ఇప్పుడు అందరి కళ్ళు బంగారం పైనే పడింది. కొందరు దుండగులు ఈజీ మనీకి అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్ కి సైతం పాల్పడుతున్నారు. ఏమాత్రం జాలి, దయ, కనికారం, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బంగారం కోసం అవసరమైతే ప్రాణాలు తీయటానికి అయిన, దాడులు చేయటానికి వెనుకాడటం లేదు. దీంతో బంగారు ఆభరణాలు ధరించిన మహిళ ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామ శివారులో దారుణం జరిగింది. గురువారం (నవంబర్ 27) మధ్యాహ్నం పొలం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న రాగోలు అన్నపూర్ణ అనే వృద్ధురాలు మెడలో 2తులాల బంగారు పుస్తెలు తాడును లాక్కుపోయాడు దుండగుడు. నడి రోడ్డుపై వృద్ధురాలి కంట్లో కారం జల్లి మెడలోని పుస్తెలతాడును తెంచుకుపోయాడు. ఆ సమయంలో వృద్ధురాలు అరుస్తూ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా ఆమెను రోడ్డుపై చుట్టూ తిప్పి కిందపడవేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
ఓవైపు బంగారం పోయిందన్న బాధ, మరో వైపు కంటిలో పడ్డ కారం మంటతో వృద్ధురాలు రోడ్డుపై తల్లడిల్లిపోయింది. లబోదిబోమంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. వృద్ధురాలు పరిస్థితిని చూసిన అటుగా ప్రయాణించేవారు ఆమె ఏం జరిగిందో తెలుసుకుని, కళ్ళు కడుక్కునేందుకు నీరు ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలిస్తున్నారు
Also Read
- ఈరోజు తొలి ఏకాదశి+శనివారం వేళ మీ ప్రేమ, కుటుంబం, కెరీర్ ఎలా ఉండబోతున్నాయి? రాశి ఫలాలు తెలుసుకోండి!
- Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?
- విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోరుతూ తరగతుల బహిష్కరణ….పి.డి.యస్. యు
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!





