10 వామపక్ష పార్టీల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నిడదవోలు మండలం శెట్టి పేట లో ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో దేశం లో ధరల పెరుగుదల కు నిరసనగా ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.పి.ఐ.యం.యల్. ( న్యూడెమోక్రసీ) పార్టీ నాయకులు ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ యుద్ధం ను బూచికగా చూపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరిగేందుకు కారణమైన కేంద్రంలోని మోడి షాల సర్కారు 2014 లో 400 రూపాయలు గా ఉన్న వంటగ్యాస్ ను రూ. 1100 లకు పైగా ఏ కారణం గా పెంచారో సమాధానం చెప్పాలన్నారు .
ఐ.యఫ్.టి.యు జిల్లా నాయకులు పామర్తి సత్యనారాయణ, గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ
జి.యస్.టి లో అత్యధిక పన్ను టారిఫ్ 28% పరిధిలోకి పెట్రోల్, డీజిల్ లను చేర్చకుండా ఎందుకు మినహాయించారో సమాధానం చెప్పాలనీ, కార్పొరేట్ ఆయిల్ కంపెనీల ఖజానాలు నింపేందుకు ప్రజల కష్టార్జితాన్ని కొల్లగోట్టే విధానాలను ప్రజలు గమనిస్తున్నారనీ, మరో ప్రక్క కోనసీమ కెజి బేసిన్ గ్యాస్ మరియు చమురు ను అంబానీ తరలించుకు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందనీ, తక్షణమే 50% వాటాను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలనీ డిమాండ్ చేశారు.
పై కార్యక్రమంలో శెట్టి పేట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ఖండవల్లి వీర వెంకట రావు, పాఠం శెట్టి రాజేష్, వరహాల స్వామి, రాజారావు, శేషగిరిరావు, కందాళ సాయి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Also read
- కొనసాగుతున్న దళితులపై దాడుల పరంపర….ఐ.యఫ్.టి.యు
- బస్టాండ్ లో దారుణం.. ప్రేమ నిరాకరించిందని బంధువు దాడి!
- కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
- Hyderabad: ఓల్డ్‌సిటీ ప్రైవేట్ స్కూల్లో కలకలం.. కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్ వర్క్..
- బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..





