October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

రైతులు కట్టిన వడ్డీలను జమచేయలేదు- కోఆపరేటివ్ సొసైటీల స్కామ్ లో ఇదో కొత్తకోణం –



ప్రకాశం జిల్లాలో సహకార వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో 93 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తారు. సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి రికవరీ చేయాల్సి ఉంటుంది. రుణాలుగా ఇవ్వడం ద్వారా వచ్చే వడ్డీతో సొసైటీలు నిర్వహణ చేసుకోవాలి. రైతులకు ఇచ్చిన రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా సొసైటీ సిబ్బంది వాటిని జమచేయని పరిస్థితి నెలకొంది.

ఆయా సొసైటీలకు అధ్యక్షులుగా ఉన్న నేతలు ఈ నిధులను సిబ్బందితో కలిసి గోల్‌మాల్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల వరకూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. గత పాలకలు తమ పార్టీ నాయకులతో త్రీమెన్, సెవెన్‌ మెన్‌ కమిటీలు వేసి జిల్లా సహకార సంఘాలను ఆడించారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధ్యక్షులను కాపాడుతూ సహకార సంఘాలను ఆర్థికంగా దెబ్బతీశారనే విమర్శలు ఉన్నాయి.

“వడ్డీ కట్టాలని చెప్పారు. వడ్డీ డబ్బులు చెల్లించాను. వాటిని జమచేయలేదు. ఎవరికి రుణాలు ఇవ్వడం లేదు. చాలా మంది డిపాజిట్లు పోయాయి. మా వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు ఇచ్చాం. వారు మా దగ్గరి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ కుంభకోణాన్ని వెలికి తీయాలని కోరుతున్నాం. – బాధితులు

ఎరువులు, పురుగు మందుల వ్యాపారం, ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు కోసం సొసైటీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు. తద్వారా వ్యాపారం చేసి సహకార సంఘాలు ఆదాయం పెంచుకోవచ్చు. కానీ గత ఐదేళ్లలో ఇవేమీ జరగకపోగా ఉన్న వాటిని మూసేశారు. అధ్యక్షులు, సిబ్బంది బినామీ రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రజ్వలంగా వెలిగిన సొసైటీలు ఇప్పుడు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి.

రుణాలు అందకపోవడంతో రైతుల ఆవేదన : ప్రకాశం జిల్లాలో 71 సంఘాల్లో దాదాపు రూ.95 కోట్ల నష్టాలు చూపిస్తున్నారు. దీంతో రైతులు రుణాల కోసం సహకార బ్యాంకులకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. రుణాలు అందక సాగు కష్టమైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అక్రమాలు జరిగిన పలు సొసైటీల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడిటింగ్‌లో అక్రమాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. వాటిపై నివేదికలు తయారు చేశారనే ఉద్దేశంతో జిల్లా సహకార ఆడిట్‌ అధికారిపై అక్రమార్కులు దాడి చేసి గాయపరిచారు. సొసైటీల్లో అక్రమాలు జరుగుతున్నాయిని కొంతమంది సిబ్బంది సైతం అంగీకరిస్తున్న పరిస్థితి నెలకొంది.

Also read

Related posts

Share via