వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించడం
ఓబులవారిపల్లె: వైసీపీ హయాంలో.. చంద్రబాబు, పవన్, లోకేశ్పై అసభ్య పదజాలం, బూతులతో పేట్రేగిన సినీనటుడు పోసాని కృష్ణమురళి ని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, విచారణకు అతను ఏ మాత్రం సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. బుధవారం రాత్రి రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు “గంటలుగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీసులు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదు, అవునా? అంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. ‘లవ్ యు రాజా’ అంటూ తనదైన శైలిలో పోసాని ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. అంతకు ముందు ఓబులవారిపల్లె పీఎస్ లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు నిర్ధరించారు.
సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా, ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ప పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్ లొ కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్ఎస్లోని 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు పోసానిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also read
- నేటి జాతకములు..13 మార్చి, 2025
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
- Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..