SGSTV NEWS
Andhra PradeshCrimeTelangana

Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్




ఏపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంపెనీకి చెందిన కారును దొంగలించి హైదరాబాద్ వెళ్లిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురంకు చెందిన రాంప్రసాద్ రెడ్డి 2009 నుంచి 2014 వరకూ ఎమ్మెల్సీకి చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ఓలా కారు డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే గత కొంతకాలంగా పని లేకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్దాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మే 28వ తేదిన గుంటూరు వచ్చాడు.

విద్యానగర్‌లోని ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ఆఫీస్‌కు వెళ్లాడు. అక్కడ కంపెనీ వైఎస్ ఛైర్మన్ కాకుమాను సాంబశివరావును కలిశాడు. తనకు ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నాడు. అయితే ప్రస్తుతం ఖాళీ లేదని కొంతకాలం పోయిన తర్వాత చూద్దామని సాంబశివరావు రాంప్రసాద్ రెడ్డికి చెప్పాడు. అయితే ఇక్కడ రెండు రోజులుండి తర్వాత కడప వెళ్లిపోతానని నమ్మకంగా చెప్పాడు. దీంతో ఆఫీస్‌లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగార్జున ఎన్ఆర్ఐ అగ్రిటెక్‌కు చెందిన ఏపి సీజెడ్ 07 2137 కారును ఆఫీస్ కార్యాలయం పార్కింగ్‌లో పెట్టి తాళం ఆఫీస్‌లో ఇచ్చి వెళ్లిపోయాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత రాం ప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్న తన లవర్‌ను కలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే కారు డ్రైవర్ కారు పార్కింగ్‌లో పెట్టి.. తాళం ఆఫీస్‌లో ఇచ్చిన విషయం గుర్తుకువచ్చింది. వెంటనే కారు తాళం తీసుకున్నాడు. కారు పార్కింగ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే తన వద్ద ఫోన్ లేకపోవడంతో వాచ్ మెన్ ఫోన్ దొంగలించి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి రాం ప్రసాద్ లేకపోవడం కారు మాయం అవ్వటంతో అగ్రిటెక్ కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే శుక్రవారం రాంప్రసాద్ రెడ్డి తిరిగి గుంటూరు వస్తుండగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తన లవర్‌ను కలిసేందుకే హైదరాబాద్ వెళ్లానని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు రాంప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేశారు

Also read

Related posts

Share this